మొగిలిపేటలో ఉచిత కంటి వైద్య శిబిరం

16-11-2026 | 06:45pm

80 మందికి కంటి పరీక్షలు.. 45 మందికి శస్త్రచికిత్సల కోసం రిఫర్

మల్లాపూర్, నవంబర్ 16 (విజయక్రాంతి): మల్లాపూర్ కనక సోమేశ్వర లయన్స్ క్లబ్(Mallapur Kanaka Someswara Lions Club) ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో రేకుర్తికి చెందిన వైద్య బృందం పాల్గొని గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించింది.

ఈ సందర్భంగా సుమారు 80 మందికి కంటి పరీక్షలు చేయగా, వారిలో 45 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించారు. దీంతో వారిని తదుపరి వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సల నిమిత్తం రేకుర్తికి పంపించారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కనక సోమేశ్వర లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ రేవెల్లి తిరుపతి, కార్యదర్శి లయన్ డాక్టర్ మండా స్వామి,

కోశాధికారి లయన్ కళ్లెం నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్ గోల్కొండ కళా రమేష్, ఉప సర్పంచ్ దండవేణి రాజేందర్, గ్రామ పాలకవర్గ సభ్యులు, ఏఎన్ఎం కవిత, గ్రామ ఆర్ఎంపీలు సంజీవ్, జగదీష్, లయన్ గాంధాల శివప్రసాద్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించేందుకు ముందుకు రావడం పట్ల గ్రామస్తులు లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు.

మరిన్ని వార్తలు