కాంగ్రెస్ పాలనలో కొత్త పింఛన్ల మంజూరు
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి, (విజయ క్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు(Welfare Schemes) అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. తుంగతుర్తి కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలకు సంబంధించి సోమవారం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మందుల సామెల్, అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ మంజూరి పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన పేదలకు చేయూత పింఛన్లు అందించడం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం, సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పాలన కొనసాగుతోందని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి పేరుతో దోచుకున్నారని,పింఛన్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ నూతన పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ,నాటి నుంచి ఎన్నికల సమయంలో, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు. నియోజకవర్గంలో సుమారు 5000 నూతన పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఎమ్మెల్యే మందుల సామెల్ కు కృతజ్ఞతలు తెలిపారు.
నాది తుంగతుర్తి గడ్డ, ఉద్యమ పోరాటాల గడ్డ, నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలు కూడా తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయి బాబా, డిఆర్డిఏ పిడి సన్యాసయ్య, ఎంపీడీవోలు చలపతి, సునీత, తాహసిల్దార్ దయానందం, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రేగటి రవి గౌడ్, వెంకన్న, మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు గుడిపాటి సైదులు, జయసుధ సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఆత్మ కమిటీ చైర్మన్ పానుగంటి నరసింహారెడ్డి, గ్రంధాలయ చైర్మన్ గంగరాజు యాదవ్, నల్లు రామచంద్రారెడ్డి, దాసరి శ్రీను ,పోలపాక రామచంద్రు, వివిధ గ్రామాల సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.