ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తుల స్వీకరణ
బోథ్. నవంబర్ 16 (విజయ క్రాంతి) ఈనెల 19 నుండి ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తుల (Indiramma Family Insurance Application) స్వీకరణ ఆన్లైన్ చేయడం జరుగుతుందని బోత్ ఎంపీడీవో ఎల్ రమేష్ పేర్కొన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులతో పాటు మీసేవ ఆపరేటర్లు సీసీలు జిపిఓలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలా అన్నారు ఎందుకు గ్రామాల కార్యదర్శిలు సర్పంచులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ రాజ్ కుమార్ డిప్యూటీ తహసిల్దార్ సూరజ్ రావు ఏపిఎం గణేష్ తదితరులు పాల్గొన్నారు