డాక్టర్ పై మంత్రి జూపల్లి సీరియస్
కొల్లాపూర్ నవంబర్ 16: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కేంద్రంలోని సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొల్లాపూర్ పెంట్లవెల్లి పెద్ద కొత్త పల్లి కోడేరు మండలాలకు చెందిన 3.696 మంజూరు పత్రాలను మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) జిల్లా కలెక్టర్ కేశవ్ పటేల్ లబ్ధిదారులకు రాజుగారు బంగ్లా దగ్గర సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పబ్లిక్ మీటింగ్లో వారు మాట్లాడుతూ. గుండ్రాల లాగా ఉండి అంగవైకల్యం అని బోగస్ సర్టిఫికెట్లు జారీచేసిన డాక్టర్స్ పే తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని పోలీస్ కేసు పెట్టి జైలుకు పంపే ఏర్పాటు చేయాలని. జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
అదేవిధంగా అంగవైకల్యం ఉన్నవారికి నేడు మంగళవారం డాక్టర్స్ కు అధికారులతో చర్చించిన తర్వాత వారికి పెన్షన్ మంజూరు చేయిస్తానని మంత్రి జూపల్లి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పసుపుల నరసింహ. మున్సిపల్ కౌన్సిలర్లు. పెద్దకొత్తపల్లి మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.