కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు జాడి రాంబాబు

16-11-2026 | 06:26pm

పూర్తి స్థాయిలో మండల కమిటీ ఎన్నిక

కన్నాయిగూడెం, నవంబర్ 16 (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీని పూర్తి స్థాయిలో సోమవారం రోజున ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్(DCC President Paidakula Ashok) ప్రకటించారు. మండలం అధ్యక్షులుగా జాడి రాంబాబు, ఉపాధ్యక్షులుగా మంగళారపు సత్యం, కంటెం రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా పీరీల భాస్కర్, కోశాధికారిగా ఆకుతోట సతీష్, అధికార ప్రతినిధిగా పూజారి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శులుగా డబ్బాగట్ల ఆనంద్, జంగా కృష్ణ, సునార్కని ఆనందరావు, సహాయకార్యదర్శులుగా కోడె తిరుపతి, దాసరి నర్సింహారావు, సునార్కని శ్రీరాములు, కార్యదర్శులుగా ఎర్రోళ్ల నర్సింహారావు, చిట్యాల అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శులుగా రాయకంటి కిరణ్, తాటి లచ్చలు, మండలం కమిటీ సభ్యులుగా ఆలం చిన్నక్క, డేగల బాణయ్య, గొంది నర్సింహారావు, కుమ్మరి రవీందర్, నల్లబోయిన గంగరాజు, మండలం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా గాందర్ల నర్సింహారావు, సోషల్ మీడియా కో కో ఆర్డినేటర్ గా గోస్కుల సదాన్ రావు లను ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా నియమించిన జిల్లా డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ కు రుణపడి ఉంటామని,ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని జాడి రాంబాబు అన్నారు.

మరిన్ని వార్తలు