పురగిరి క్షత్రియ మండల కమిటీ ఎన్నిక
గోవిందరావుపేట, నవంబర్ 16 (విజయక్రాంతి): పురగిరి క్షత్రియ (పేరిక) సంఘం(Puragiri Kshatriya Sangham Elects) నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని చలవాయి గ్రామంలో సోమవారం పురగిరి క్షత్రియ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు అక్కల రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రాజకుమార్, జిల్లా గౌరవ అధ్యక్షులు గందే జగన్నాథం, జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి వెంకన్న బండారుపల్లి నేత అప్పని వీరస్వామి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.
మండల కమిటీలో గౌరవ అధ్యక్షులుగా పాపక సమ్మయ్య, అధ్యక్షులుగా వాసం స్వామి, ప్రధాన కార్యదర్శిగా కంటే సూర్యనారాయణ, కోశాధికారిగా దొంగరి అశోక్, అసోసియేట్ అధ్యక్షులు వాసం శంకర్, ప్రచార కార్యదర్శి ఎగ్గడి వంశీ, ఉపాధ్యక్షులు అప్పని లక్ష్మీనారాయణ, మర్రి దేవక్క, ముద్దసాని శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎసిరెడ్డి రమేష్, కార్యదర్శి సంఘని ప్రశాంత్, ముఖ్య సలహాదారులుగా సంఘని నాగరాజు, తమ్మిశెట్టి శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని సంగం నేతలు, కుల పెద్దలు పాల్గొనడం జరిగింది.