ఇంటి పైకప్పు నిర్మాణానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం

15-11-2026 | 05:17pm

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

జగిత్యాల, నవంబర్ 15 (విజయక్రాంతి): జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి గ్రామానికి చెందిన నేరెల్ల కవిత స్వామి దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(MLA Sanjeev Kumar) హాజరై, నూతన గృహాన్ని ప్రారంభించి, దంపతులకు శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు.

పేద ప్రజల ఆత్మగౌరవం, భద్రత, భరోసా. ఎండకు, వానకు, చలికి ఇబ్బందులు పడుతూ గుడిసెల్లో జీవించే నిరుపేదలకు ఒక పక్కాఇల్లు నిర్మించుకోవాలనే కల సాకారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పథకం అన్నారు. ఆ కలను నిజం చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే గోడలు, పునాదులు బలంగా ఉండి, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక రేకుల పైకప్పులుతో నివసిస్తున్న పేద కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు పాత పైకప్పు స్థానంలో పక్కా ఆర్‌సీసీ స్లాబ్ నిర్మించుకునేందుకు రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుందని అన్నారు.

జగిత్యాల నియోజకవర్గానికి 500 రూఫ్ రీప్లేస్మెంట్ మంజూరు అయ్యాయి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా గుడిసెల్లో ఉండకూడదు. ప్రతి నిరుపేద కుటుంబానికి సురక్షితమైన ఇల్లు ఉండాలిని ముఖ్య మంత్రి ప్రధాన లక్ష్యం అని తెలిపారు.

రాజకీయాలకు, కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి అన్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు అతి త్వరలో మంజూరు చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బలముకుందాం, మాజీ సర్పంచ్ అంజయ్య, సర్పంచ్ లు అంకతి మల్లయ్య, పరశురామ్ గౌడ్, మల్లేష్, సింగం శ్రీనివాస్, నాగపూషణం తదితర నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు