గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్ ప్రతినిధులు

15-11-2026 | 05:27pm

నిర్మల్ నవంబర్ 15 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap Shukla)ను హైదరాబాద్‌లోని గవర్నర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు సామనపల్లి రాఘవులు, నిర్మల్ జిల్లా చైర్మన్ గొజ్జా జనార్దన్ గవర్నర్‌ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గవర్నర్‌కు వివరించారు. సమాజ సేవలో రెడ్‌క్రాస్ సొసైటీ మరింత విస్తృతంగా సేవలందించాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించాలని గవర్నర్ సూచించినట్లు వారు తెలిపారు.


మరిన్ని వార్తలు