ఖాజీపేటలో ఘనంగా నారాయణ క్రీడా సంబరాలు

14-11-2026 | 08:56pm

జనగామ, నవంబర్ 14 (విజయక్రాంతి) : నారాయణ విద్యాసంస్థల(Narayana Educational Institutions) ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి క్రీడా సంబరాలు ఖాజీపేట నారాయణ పాఠశాలలో(Narayana School, Kazipet) ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హన్మకొండ జిల్లా వైద్యాధికారి ఎ. అప్పయ్య, ఖాజీపేట పోలీసు సహాయ కమిషనర్ ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. క్రీడలు విద్యార్థుల్లో(Sports student) ఆరోగ్యం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో, చదరంగం, కేరం పోటీలను 14 ఏళ్ల లోపు, 17 ఏళ్ల లోపు విభాగాల్లో నిర్వహించారు.

అగ్ని, పృథ్వి, నాగ్, త్రిశూల్ బృందాల మధ్య పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతరం విజేతలకు ప్రశాంత్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉప ప్రధాన నిర్వాహకురాలు రిజ్వానా ఇమ్రాన్, ప్రధాన ఉపాధ్యాయురాలు ఫర్హానా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు