ఏకగ్రీవంగా జిల్లా మాల కుల సంఘం ఎన్నిక
అధ్యక్షులుగా మాదాసి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కుడుదుల వెంకటేష్
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాJayashankar Bhupalpally district) కేంద్రంలో శనివారం గీస సంపత్ అధ్యక్షతన మాల కుల సంఘం(Mala Kulam Sangham) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా మాల సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మాదాసి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఉపాధ్యక్షులుగా రేళ్ల కుమార్, బిల్లం ప్రసాద్, కార్యదర్శిగా గీస సంపత్, బందెల భూమయ్య, కోశాధికారిగా సలాకుల వెంకటరాజం లను ఎన్నుకున్నారు. అదేవిధంగా ప్రచార కార్యదర్శిగా మాదాసు ఉమేష్, గౌరవ అధ్యక్షులుగా కె రాజయ్య, జోగుల సమ్మయ్యలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాదాసి శ్రీనివాస్ మాట్లాడుతూ మాలల హక్కుల సాధనకు, మాలల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.