భూ భారతి రీ సర్వేను వేగవంతం చేయాలి
- వేసవిలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి...
- నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి...
బాన్సువాడ, నవంబర్ 14 (విజయ క్రాంతి): భూ భారతి కార్యక్రమంలో(Bhu Bharati Program) భాగంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రైతులకు భూములకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనిపూర్ గ్రామంలో పర్యటించిన కలెక్టర్ భూ భారతి రీ సర్వే పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి సర్వే వివరాలు, రైతుల సమస్యలు, పెండింగ్లో ఉన్న అంశాలపై ఆరా తీశారు. రీ సర్వే పనుల్లో జాప్యం లేకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.అలాగే వేసవి కాలంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ పంటల సాగు చేపట్టాలని,
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు, సలహాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డిఓ ప్రశాంత్ కుమార్,సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.