హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ

14-11-2026 | 08:54pm

ఘన స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, నవంబరు 14 (విజయక్రాంతి): భారత్ సమ్మిట్‌లో(Bharat Summit) పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) శనివారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి పుష్పగుచ్ఛం అందించి తెలంగాణకు ఆహ్వానించారు.

రాహుల్ గాంధీ తెలంగాణకు రావడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. భారత్ సమ్మిట్‌లో జరగనున్న కీలక చర్చలు, సంప్రదింపులు దేశ భవిష్యత్తుకు సంబంధించిన పలు అంశాలపై ఉపయోగకరంగా ఉంటాయని, ఈ సమావేశాల్లో జరిగే చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు