ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచ్ కృష్ణ ముదిరాజ్ ప్రత్యేక చొరవ

20-11-2026 | 12:13am

కంగ్టి,(విజయక్రాంతి): గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కంగ్టి గ్రామ సర్పంచ్ కృష్ణ ముదిరాజ్(Kangti village sarpanch Krishna Mudiraj) ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో తలెత్తిన మోటార్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. కిందిదొడ్డి రాజు ఇంటి సమీపంలో ఉన్న మోటార్‌కు మరమ్మతులు చేయించడంతో పాటు నూతన సింగిల్ ఫేజ్ మోటార్‌ను ఏర్పాటు చేయించారు.

కాలనీ ప్రజలకు నీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేసిన సర్పంచ్ కృష్ణ ముదిరాజ్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని అన్ని కాలనీల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం పేర్కొంది.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు