మోరాయించిన ఇంజన్

20-11-2026 | 12:19am

మానుకోట వద్ద రెండు గంటల పాటు నిలిచిన కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు 

మహబూబాబాద్: తిరుపతి నుంచి అదిలాబాద్ వెళుతున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్లో సాంకేతిక లోపం ఏర్పడి మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం నిలిచిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు మరో ఇంజన్ రప్పించి రైలును తిరిగి ప్రయాణించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ కారణంగా విజయవాడ కాజీపేట రైల్వే మార్గంలో పలు రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది. కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు దాదాపు రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. రైలు ఇంజన్ మొరాయించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

మరిన్ని వార్తలు