హార్వెస్టర్ లీజ్ ఇప్పిస్తామని కిడ్నాప్
10 లక్షలు డిమాండ్
రెండోసారి కిడ్నాప్ కోసం వచ్చి దొరికిన కిడ్నాపర్లు
కిడ్నాప్ కేసును చేదించిన పోలీస్ అధికారులను అభినందించిన ఎస్పి
కిడ్నాపర్ల కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): హార్వెస్టర్ లీజు(Harvester Lease Case) పేరుతో కిడ్నాప్ కు పాల్పడ్డ ముఠాను పోలీసులు ఎట్టకేలకు సోమవారం అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిడ్నాప్ కేసు వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం కోనాపూర్ చిందం మహేష్ హార్వెస్టర్ మిషిన్లను లీజుకి తీసుకొని నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు.
ఈ క్రమంలో కరుణాకర్ రెడ్డి అనే పేరుతో ఒక వ్యక్తి పరిచయం చేసుకొని మహేందర్ కు హార్వెస్టర్ మిషన్లు లీజుకి ఇస్తానని నమ్మించాడు. గత నెల 22న రాత్రి మాట్లాడదామని పిలిచి కారులో కిడ్నాప్ చేశారని మార్గమధ్యంలో మరో ఇద్దరు తో కలిసి బాధితుడు ముఖానికి కొన్ని టోపీని మాస్కులు వేసి దాడి చేసి చంపేస్తామని బెదిరించి అతని వద్ద ఉన్న పీవో సి ఓ ఎం ఆర్ 5జి సెల్ఫోన్, పర్సులోని 2500 నగదులు బలవంతంగా లాక్కున్నారు.
నిందితుల చరణం నుంచి తప్పించుకున్న బాధితులు ఇందల్వాయి బస్టాండ్ కి చేరుకొని తన గ్రామస్తులకు సమాచారం అందించాడు. అక్కడి నుండి దోమకొండకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి డిఎస్పి మధుసూదన్ పర్యవేక్షణలో భిక్కనూరు సిఐ నరేష్, దోమకొండ ఎస్సై ప్రభాకర్, సిబ్బందితో కలిసి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
బాధితుడు ఇచ్చిన సమాచారం సీసీటీవీ కెమెరాల పరిశీలన, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు చర్యలను వేగవంతం చేసినట్లు తెలిపారు. నిందితులు తాడువాయి మండలం చిట్యాల కు చెందిన నీట్టు నరసింగరావు, నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంకు చెందిన ఎరుగు నగేష్, గన్నారం కు చెందిన తెడ్డు సురేష్, కోనాపూర్ కు చెందిన చిందం శ్రీకాంత్ లు ముఠాగా ఏర్పడి మహేందర్ కు హార్వెస్టర్లు లీజుకు ఇప్పిస్తామని నమ్మించి కిడ్నాప్ చేసి రూ 10 లక్షలు డబ్బులు డిమాండ్ చేశారు.
తప్పించుకో నీ వెళ్లిన మహేందర్ ను మరోసారి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ముఠాను సోమవారం కోనాపూర్ గ్రామ శివారులో ఎల్లమ్మ గుడి వద్దండగా పోలీసులు కారునాభి అనుమానించిన వారి నాయకులు తీసుకొని విచారించగా కిడ్నాప్ దోపిడి ముఠా బయటపడిందని ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి తెల్లారంగు ఎర్టిగా కారు టీఎస్ 16 ఈ ఎఫ్ 8889, సెల్ ఫోన్లు నాలుగు, బాధితుడు ముఖానికి ఉపయోగించిన మాస్క్ టోపీ, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పట్టుబడిన మూట లోని నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ స్పందించినట్లు తెలిపారు. ఈ కేసును చేదించిన బిక్కనూరు సిఐ నరేష్, బికనూర్ దోమకొండ ఎస్సైలు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో కామారెడ్డి డిఎస్పి మధుసూదన్, బికనూర్ సిఐ నరేష్, దోమకొండ ఎస్సై ప్రభాకర్, కానిస్టేబుల్ సాయిబాబా, బాలకృష్ణ, భైరవ ప్రసాద్, హోంగార్డు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.