అమ్మ సేవలో మహిళలు

15-11-2026 | 04:53pm

తాడ్వాయి,నవంబర్,15( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం ఏండ్రి యాల గ్రామానికి చెందిన మహిళలు అమ్మ సేవలో పాల్గొంటూ సేవలు చేస్తున్నారు. ఏండ్రియాల్ గ్రామానికి(Endrial Village) చెందిన 20 మంది మహిళలు గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి రెండవ శనివారం శ్రీ శబరిమాత ఆశ్రమానికి(Sri Sabarimata Ashram) వచ్చి అన్న ప్రసాదం చేస్తూ తమ సేవలు కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మహిళలకు అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని వారికి కృతజ్ఞతలు తెలిపారు. సేవలో పాల్గొంటున్న వారిలో శాంతాబాయి, లక్ష్మి,బుజ్జమ్మ,మంజుల, అమృత,నరసమ్మ,అనిత,రాజమణి,విజయ మణెమ్మ,విట్టబాయి, భాగ్యమ్మ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు