అంబేద్కర్ ఆలోచనలే దేశానికి మార్గదర్శకం

15-11-2026 | 05:20pm

కరీంనగర్ సిటీ నవంబర్15 (విజయక్రాంతి) : అంబేద్కర్ ఆలోచనలు(Ambedkar's Ideas) భారతదేశానికి మార్గదర్శకమని(Guidance) ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్(Prajamitra Progressive Democratic Front) రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్(Korivi Venugopal) అన్నారు. ఆదివారం కరీంనగర్ కోర్టు వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Dr BR Ambedkar) విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గత నవంబర్ 1వ తేదీ నుంచి ప్రతి ఆదివారం కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సామ్రాట్ అశోకుని కాలం తర్వాత భారతదేశం అనేక రాజ్యాలుగా విడిపోయి వివిధ రాజుల పాలనలో కొనసాగిందన్నారు. బ్రిటిష్ పాలన (British Rule) అనంతరం దేశాన్ని ఐక్యంగా, సమగ్రంగా కొనసాగించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే భారతదేశం బలమైన గణతంత్ర దేశంగా కొనసాగుతోందని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను ప్రతి ఒక్కరూ నిత్యం స్మరించుకోవాలని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గజ్జల ఆనందరావు, కొంపెల్లి రవీందర్, తాళ్ల వెంకటేష్, సిగిరి శ్రీధర్, కడపల విజయకుమార్, క్యాద్యాసి ప్రభాకర్, మాడెపు నరసయ్య, గాదం రవీందర్, పాటకుల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు