అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తకు పరామర్శ

14-11-2026 | 08:46pm

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్(Bikkannur) మండలంలోని అంతంపల్లి, భిక్కనూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ(BRS party) కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Former MLA Gampa Govardhan) శనివారం పరామర్శించారు. అంతంపల్లి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త పిట్ల చిన్న గంగయ్య పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. అదే గ్రామానికి చెందిన జీడీ సిద్దయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఓదార్చి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అలాగే భిక్కనూర్‌కు చెందిన తాటిపాముల కిరణ్ గౌడ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నల్లవెల్లి అశోక్, కుంభాల రవి, అత్తెల్లి శ్రీనివాస్, అందె మహేందర్, తునికి వేణు, బోండ్ల రాంచంద్రం, మధుసూదన్ రెడ్డి, రంజిత్, సురేందర్ రెడ్డి, గణేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రామకృష్ణ, నారాయణ, రాజశేఖర్, ప్రభాకర్, శ్రీనివాస్, విష్ణు, నవీన్, భాస్కర్, బొడ్డు రాజు, గడిల శ్రీనివాస్, లక్ష్మణ్, అంజిరెడ్డి, రవి, బస్వయ్య, సత్యం, చంద్రము, బాబు, ఎల్లం, అనిల్, భాను, కొత్తిమీర శ్యామ్, చెలిమేలా భాను తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు