తెలంగాణ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవిచంద్ర నియామకం

14-11-2026 | 08:51pm

గౌరవ అధ్యక్షులుగా పొన్నం రవిచంద్ర, ముఖ్య సలహాదారులుగా జీవి శ్యాంప్రసాద్ లాల్ 

కరీంనగర్, నవంబర్14(విజయక్రాంతి): తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(Telangana Short Film Makers Welfare Association) ( రిజిస్ట్రేషన్ నెంబర్ 459/2020 ) గౌరవ అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్టు, నంది అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర(Ponnam Ravichandra) ని నియమించినట్లు తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయిలు రమేష్(Ailu Ramesh) తెలిపారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా కొనసాగుతున్న ఆసంపల్లి శ్రీనివాస్ గారి పాటు పొన్నం రవిచంద్ర గౌరవాధ్యక్షులుగా ఇద్దరు కొనసాగుతారు .

తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులుగా ఐఏఎస్ అధికారి జి వి శ్యాం ప్రసాద్ లాల్  కొనసాగుతారు.

మరిన్ని వార్తలు