జీవితంలో సరైన దారి చూపించేవి పుస్తకాలే

15-11-2026 | 05:24pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): జీవితంలో సరైన దారి చూపించేవి పుస్తకాలేనని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను(libraries) సందర్శించి పుస్తక పఠనం అలవర్చుకోవాలని మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) పౌర సంబంధాల శాఖ అధికారి పసునూరి రాజేంద్రప్రసాద్(Pasunuri Rajendraprasad) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో(National Library Week Celebrations) భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ స్పర్ధయ వర్ధతే విద్య, అని  చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకాన్ని మాత్రం కొనుక్కోవాలనే మహానుభావుల మాటలను గుర్తు చేశారు.

జీవితంలో సరైన దారి చూపించే పుస్తకాలు మాత్రమే అని, ప్రసార మాధ్యమాలు వేగవంతంగా సమాచారాన్ని క్షణకాలంలో అందిస్తున్నప్పటికీ, మానవుని మేధో వికాసానికి పుస్తకమే పునాది అని అంటూ, చిన్నతనం నుంచి పిల్లలలో పుస్తక పఠనం అలవాటు పెంపొందిస్తే వారు కేవలం పరీక్షలో మార్కులు సాధించే విద్యార్థులుగా కాకుండా ప్రశ్నించే, ఆలోచించే, సృజనాత్మకంగా స్పందించే పౌరులుగా ఎదుగుతారన్నారు.ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్లు జి. విజేందర్,రుద్రారపు వీరేందర్, సిబ్బంది బొడ్డుపల్లి భూలక్ష్మి, బి. యాదమ్మ గ్రంథాలయ పాఠకులు హరిలాల్, ఆర్ సి. విజ్ఞాన్, అనూప్ సూరజ్, మౌనిక ,కవిత, సరిత పుస్తక ప్రియులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు