డిసెంబర్ 9న ఖమ్మానికి సీఎం రేవంత్ రెడ్డి

14-11-2026 | 08:18pm

మున్నేరు పై కేబుల్ బ్రిడ్జి, ఖమ్మం-రాజమండ్రి గ్రీన్ పీల్డ్ హైవే ను ప్రారంభించనున్న సీఎం

పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

ప్రకటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, నవంబర్ 14 (విజయక్రాంతి): డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఖమ్మం జిల్లాలో(Khammam District) పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతనంగా నిర్మాణం చేసిన మున్నేరు పై కేబుల్ బ్రిడ్జి, ఖమ్మం -రాజమండ్రి గ్రీన్ పీల్డ్ హైవే,  వెలుగుమట్ల మోడల్ కాలనీ,  మిర్చి మార్కెట్‌లను సీఎం ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) వెల్లడించారు.

శనివారం భక్త రామదాసు ఆడిటోరియంలో నిర్వహించిన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ(Distribution of pension sanction documents) కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.ఖమ్మం నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు

పేదల సంక్షేమానికి ప్రాధాన్యత

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశామని, ఇందిరమ్మ రాజ్యంలో మొత్తం 45 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. వృద్ధులు తమ పిల్లలపై ఆధారపడకుండా చేయూత పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు.

సన్నబియ్యం పంపిణీ, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని వివరించారు.

సాగునీటి సమస్య లేకుండా చర్యలు

ఎల్‌నినో ప్రభావంతో నాగార్జునసాగర్ నుంచి ఆశించిన స్థాయిలో నీరు రాలేదని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. సాగర్ ఆయకట్టులోని లక్షన్నర ఎకరాలను గోదావరి జలాలతో కాపాడుకున్నామని పేర్కొన్నారు. మురసు తుఫాను కారణంగా చేతికందే దశలో ఉన్న పంటలు నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ఖమ్మం నగరంలోని ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు లేకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు