రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు విద్యార్థినులు ఎంపిక

14-11-2026 | 08:45pm

జిల్లాస్థాయి టోర్నీలో మాధవికి ద్వితీయ స్థానం.. అర్చనకు నాలుగో స్థానం

గజ్వేల్, నవంబర్ 14: రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్‌-17 చెస్ పోటీలకు(State-level SGF Under-17 Chess Competition) గజ్వేల్ మండలం అహ్మదీపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. నవంబర్ 13న గజ్వేల్‌లో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్‌లో పదో తరగతి విద్యార్థినులు యు.

మాధవి ద్వితీయ స్థానం, యు. అర్చన నాలుగో స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలోనూ రాణించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుగుణాకర్ ఆకాంక్షించారు. విద్యార్థినుల ఎంపిక పట్ల గ్రామ సర్పంచ్ బ్యాగరి ప్రభాకర్, గ్రామ పెద్దలు, పీడీ నాగేష్ హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.

మరిన్ని వార్తలు