కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు
14-11-2026 | 08:44pm
కొల్చారం, నవంబర్ 14: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును(Kalvakuntla Taraka Rama Rao) హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కొల్చారం మండల సర్పంచ్ల ఫోరం(Kolcharam Mandal Sarpanches' Forum) ప్రధాన కార్యదర్శి, తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ దొడ్లే ఆంజనేయులు(Dodle Anjaneyulu) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రాజకీయ, గ్రామీణ పరిస్థితులపై చర్చించారు. అనంతరం నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆంజనేయులు తెలిపారు.