ఘనంగా బాలల గ్రామసభ
జన్నారం,(విజయక్రాంతి): జాతీయ బాలల దినోత్సవాన్ని(National Children's Day) పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా(Mancherial District) జన్నారం మండలంలోని పొనకల్ ప్రాథమిక పాఠశాల(Ponakal Primary School)లో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభను శని వారం ఘనంగా నిర్వహించారు. పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల హక్కులు, బాధ్యతలు, ఆరోగ్యకరమైన జీవన విధానం, మంచి అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కల్పిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ–ఏఎక్స్ఎల్ కంప్యూటర్ ల్యాబ్‌ను సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇటువంటి సదుపాయాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.