శిశుమందిర్‌లో ఘనంగా స్వయం పాలన దినోత్సవం
ఆసిఫాబాద్, నవంబర్ 14(విజయ క్రాంతి): బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో(Sri Saraswati Shishu Mandir) శనివారం స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 30 మంది విద్యార్థులు ఆచార్యులుగా మారి నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠాలు బోధించారు. 9వ తరగతి విద్యార్థిని గుత్తి వెంకటరత్న ప్రధానాచార్యురాలిగా, హరిచరణ్ పీఈటీగా, కార్తీక్ వ్యవహరించారు.
అనంతరం విద్యార్థులకు రెండు గంటలపాటు ఆటలు నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తిలోని కష్టసుఖాలను స్వయంగా అనుభవించిన విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.