ప్రజా పాలనలో పేదవానికి జీవిత బీమా

15-11-2026 | 04:28pm

 భద్రు నాయక్

సింగరేణి నవంబర్ 15 విజయక్రాంతి: నవంబర్ 19 నుండి ఇందిరమ్మ జీవిత బీమా పాలసీ(Indiramma Life Insurance Policy) ప్రారంభమవుతుందని డీసీసీ కార్యదర్శి ధరావత్ భద్రు నాయక్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డు(White ration card) ఉన్న ప్రతి పేద కుటుంబం అర్హులని, పాలసీ డబ్బు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. కుటుంబ యజమాని మరణిస్తే కుటుంబానికి ఈ పథకం ఆసరాగా ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి(Revanth Reddy), ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు