తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం

17-11-2026 | 02:03pm

చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి – వక్తల పిలుపు

కల్లూరు, నవంబర్ (విజయ క్రాంతి): తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు(Service Activities) నిర్వహించడం అభినందనీయమని వక్తలు అన్నారు. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Government Junior College, Kalluru) జీడీబీ పల్లి (బోడిమెల్లి) గ్రామానికి చెందిన సంఘం శంభయ్య–తిరుపతమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు సంఘం మల్లయ్య, లయన్ సంఘం వెంకట పుల్లయ్య, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ వేముల శేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సత్తుపల్లి రూరల్ సీఐ పి. సర్వయ్య, మోటివేషనల్ ట్రైనర్ జవ్వాది వెంకటేశ్వర బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చట్టాలను గౌరవిస్తూ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు.

ట్రైనర్ వెంకటేశ్వర బాబు మాట్లాడుతూ సమయపాలన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నిరంతర కృషితో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని వివరించారు. నిర్వాహకుడు సంఘం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కల్లూరు ఎస్‌ఐ జె. నాగరాజు, సమాజ సేవకులు అమీరుద్దీన్, మాడిశెట్టి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు