ఒకే స్టేజ్‌పై ఇద్దరు డ్యాన్స్ క్వీన్స్
స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, శ్రీలీల(Sai Pallavi Sreeleela) ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు పండగే. అలాంటిది ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఆ సందడే వేరు. తాజాగా ధనుష్ నటిస్తున్న 'O.M' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో(Dhanush OM Pre Release Event) ఇదే సీన్ రిపీట్ అయింది. తమ అద్భుతమైన డ్యాన్స్‌తో ఈ ఇద్దరు భామలు వేదికను హోరెత్తించారు.
హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో సాయి పల్లవి, శ్రీలీల కలిసి 'అలాకా లూవా' పాటకు స్టెప్పులేశారు. సాయి పల్లవి తన సహజమైన గ్రేస్‌తో ఆకట్టుకోగా, శ్రీలీల ఎనర్జిటిక్ మూమెంట్స్‌తో అదరగొట్టారు. ఇద్దరి డ్యాన్స్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. వీరి ప్రదర్శనను ఆస్వాదించిన హీరో ధనుష్ సైతం కుర్చీలో కూర్చుని చప్పట్లు కొడుతూ అభినందించారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ధనుష్, మలయాళ స్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రేణు దేశాయ్, నాజర్ తదితరులు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. 'O.M: Chapter 1 – Udhiram: The Blood Wood' పేరుతో రూపొందిన ఈ సినిమా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రీ రిలీజ్ వేడుకలో స్టార్ల సందడి సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
Sai Pallavi and Sreeleela performed dance on stage at the Telugu event of #om #SaiPallavi #Sreeleela https://t.co/pYQ210Vq6l
— Monu Singh Official (@Monu_Singh2308) November 17, 2026