ఎల్ నినోపై అవగాహన సదస్సు

17-11-2026 | 01:49pm

తంగళ్ళపల్లిలో క్షేత్ర బచావో అభియాన్

రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు శ్రీనివాస్ రెడ్డి

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): తంగళ్ళపల్లిలో క్షేత్ర బచావో అభియాన్ కార్యక్రమం(Bachao Abhiyan program)తో పాటు ఎల్ నినో ప్రభావం(El Nino effect)పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులే దేశానికి వెన్నెముక అని రైతులు బాగుంటేనే గ్రామాలు దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు.

రైతులు ప్రకృతి వ్యవసాయం(Natural farming) వైపు మొగ్గుచూపాలని రసాయన ఎరువులు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సాగు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్ని భూసారాన్ని కాపాడుకోవాలని కోరారు. తక్కువ నీటితో పండే పంటలు పంటల మార్పిడి కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.

ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని తెలిపారు. రైతులకు మార్కెట్ కమిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం రైతులకు సబ్సిడీపై అందుబాటులోకి వచ్చిన పెసర విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోర లక్ష్మీరాజం డీపీఓ మండల ప్రత్యేక అధికారి ఎంపీడీవో ఎమ్మార్వో వ్యవసాయ శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు