మండలికి పంపితే.. గల్లా పట్టి అడుగుతా..!
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాష్ కొల్లూరు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యా, ఉపాధి, వ్యవసాయం, వలసలు వంటి సమస్యల పరిష్కారం కొరకు మండలిలో గల్లాప్పటి అడుగుతానని తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్(Osmania University gold medalist), మాజీ జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరు అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ వంటి పార్టీలు ఇప్పటివరకు ఉద్యోగ, నిరుద్యోగ ఓట్లు రాల్చుకొని సమస్యలు ప్రస్తావించిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మెల్సీ ఓట్లు అడిగే ఆయా పార్టీల అభ్యర్థులు ఏం ఉద్ధరిస్తారో చెప్పాలని బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.