నాటుసారాపై పోలీసుల మెరుపుదాడులు.!

17-11-2026 | 01:59pm
  1. రాయికుంట తండాలో 2 లీటర్ల నాటుసారా పట్టివేత
  2. ఒక కేసు నమోదు చేసిన మోతె పోలీసులు
  3. రెండో రోజు కొనసాగిన ఆకస్మిక తనిఖీలు
  4. మళ్లీ పట్టుబడితే రూ.5 లక్షల బాండ్ జప్తు: ఎస్ఐ లచ్చిరెడ్డి

మోతె, నవంబర్ 17 (విజయ క్రాంతి): నాటుసారా తయారీ, విక్రయాలపై మోతె పోలీసులు నిఘా పెంచారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ(Suryapet District SP Narasimha) ఆదేశాలతో మండలంలో వరుసగా రెండో రోజు మెరుపుదాడులు నిర్వహించారు. మోతె మండల పరిధిలోని రాయి కుంట తండాలో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో 2 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని, ఒక కేసు నమోదు చేశారు.

నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ లచ్చిరెడ్డి హెచ్చరించారు. పట్టుబడిన వారిని రూ.5 లక్షల పూచీకత్తుతో ఏడాది పాటు బైండోవర్ చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ ఇదే వ్యాపారానికి పాల్పడితే రూ.5 లక్షల బాండ్ మొత్తాన్ని జప్తు చేస్తామని స్పష్టం చేశారు. నాటుసారా రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని, ఎక్కడైనా తయారీ, విక్రయాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు