ఖమ్మం బైపాస్ రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు

12-11-2026 | 05:20am

న్యూ విజన్ జూనియర్ కళాశాల వద్ద నిత్యం ఇబ్బందులు.. పట్టించుకోని అధికారులు!

ఖమ్మం టౌన్, నవంబర్ 11(విజయంక్రాంతి): నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న న్యూ విజన్ జూనియర్ కళాశాల(New Vision Junior College) పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు(Traffic problems) రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. కళాశాలకు వచ్చే విద్యార్థులు(Students), స్థానిక ప్రజలు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. కళాశాల ప్రారంభమయ్యే సమయం, తరగతులు ముగిసే సమయంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది.ఈ ప్రాంతంలో సరైన ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం, వాహనాల పార్కింగ్ సమస్యలు కూడా ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి

సంబంధిత అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైన చోట ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు, వాహనాల పార్కింగ్ను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నియంత్ర ణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి న్యూ విజన్ జూనియర్ కళాశాల పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తారా? అని స్థానికులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు