పోటీ పరీక్షల కోసం ప్రత్యేక లైబ్రరీల ఏర్పాటుకు కృషి
ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు
కాగజ్ నగర్, నవంబర్ 15 ( విజయక్రాంతి) : పోటీ పరీక్షలకు(competitive examinations) ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల(candidates) కోసం ప్రత్యేక లైబ్రరీలు, స్టడీ రూమ్లు(Libraries, study rooms) ఏర్పాటు చేస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు(Sirpur MLA Dr. Harish Babu) తెలిపారు. ఆదివారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(Government Degree College, Kagaznagar) సబ్ ఇన్స్పెక్టర్ పోటీ పరీక్షలకు తయారవుతున్న అభ్యర్థులకు ప్రజా బంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాక్ టెస్ట్ నిర్వహించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రమశిక్షణ అంకితభావంతో కృషి చేస్తే ఉద్యోగాలు సులువుగా సాధించవచ్చని అన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కాగజ్ నగర్ పట్టణంలో ప్రజా బంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక లైబ్రరీ ఏర్పాటు చేసి వారిని ఉద్యోగాలు సాధించి క్రమంలో సన్నద్ధులను చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, అధ్యాపకులు దుర్గం జనార్ధన్, కౌన్సిలర్లు గజ్జల లావణ్య--లక్ష్మణ్, కొప్పుల శంకర్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.