ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తోడ్పడాలి
54 మంది విద్యార్థులకు టీ షర్టుల పంపిణీ
మహబూబాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల(Government schools) అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, దాతలు, గ్రామస్తులు ముందుకు రావాలని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గుర్రాల సురేశ్ పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని జంగిలిగొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం 54 మంది విద్యార్థులకు టీ షర్టులను పంపిణీ చేశారు.
సర్పంచ్ గుండెల రేణుక మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుంచే నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల అభివృద్ధికి సురేశ్ అందించిన సహకారం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొయ్యల అనిల్, వీవో అధ్యక్షురాలు గోల్కొండ శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.