అమెరికాలో భారీ వరదలు
ప్రభావితమైన వేలాదిమంది
వాషింగ్టన్, నవంబర్ 3: ఎన్నికల వేళ(During election time) అమెరికా భారీ వరదలు(Massive floods in America) వణికించాయి. నైరుతి ప్రాంతం, మెక్సికోలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) కారణంగా తీవ్రమైన వరదలు సంభవిం చి, వేలాది మంది ప్రజలు ప్రభావితమయ్యా రు. కొలరాడో, న్యూజెర్సీ, గ్రాండ్ కాన్యన్‌లోని పలు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపో యాయి. దీంతో వేగంగా నదీమట్టాల నీరు పెరిగి ఉప్పొంగింది. అధికారులు ఆయా ప్రాంతాల ప్రజలను సహాయక చర్యలు చేప ట్టి పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి కొలరాడోని పగోసా స్ప్రిం గ్స్ అధికారులు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేయడం మరింత ఆందోళన కలిగిస్తుంది.
శాన్ జువాన్ నది 21.9 అడుగుల గరిష్ఠ స్థా యికి చేరుకుంది. గత వందేళ్లనాటి వర్షపాత రికార్డు బద్దలైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అరిజోనా, దక్షిణ ఉటా, పశ్చిమ న్యూ మెక్సికో, నెవడాలకు వరద హెచ్చరిక లు జారీ అయ్యాయి. వరదల ధాటికి రహదారులపై ఉన్న కార్లు కొట్టుకుపోయాయి. వరదల ప్రభావంతో పలు ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లను అధికారులు మార్చాల్సి వచ్చింది.