కల్తీపై ఎఫ్‌డీఏ కొరడా

04-11-2026 | 05:25am

మహారాష్ట్రలో 114చోట్ల సోదాలు

13 ఎఫ్‌ఐఆర్‌లు, 16మంది అరెస్ట్, ఆరు వాహనాలు స్వాధీనం

19 వ్యాపార సంస్థల లైసెన్సులు రద్దు, 9 కోట్ల సరుకు సీజ్

2,279 లీటర్ల పతంజలి ఆవు నెయ్యి కూడా స్వాధీనం

ముంబై, నవంబర్ 3: మహారాష్ట్రలో కల్తీ ఆహారంపై(Adulterated food) ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్)(Food and Drug Administration) దాడులు నిర్వహించింది. ఈ దా డుల్లో కల్తీకి పాల్పడుతున్న 19 వ్యాపార సం స్థల లైసెన్సులను రద్దు చేసింది. వివిధ సంస్థ లకు చెందిన రూ. 9 కోట్ల విలువైన సరుకు ను కూడా సీజ్ చేసింది. పండుగ సీజన్‌లో(Festive season) కల్తీని అరికట్టడంలో భాగంగా మంగళవారం ఎఫ్‌డీఏ మహారాష్ట్రలోని ఏడు డివిజన్లలోని 114 చోట్ల ఆహార భద్రతా కమిషనర్ తుకా రాం ముండే నేతృత్వంలోని ఏకకాలంలో సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు.

మొత్తం 3.53 లక్షల కిలోల విలువైన కల్తీ సరుకును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ముంబై, అమరావతి, పూణే, సతారా, సోలాపూర్, ఛత్రపతి సంభాజీనగ ర్‌లలో పలు సంస్థలు శుభత్రను పాటించలే దని, కల్తీని గుర్తించామన్నారు. భివండిలో అవెన్యూ సూపర్ మార్కెట్ లిమిటెడ్‌లో 1,44,218 కిలోల వంటనూనె, సతారాలో అమిన్ ట్రేడర్స్ నుంచి 20,560 కిలోల బియ్యం, పప్పుధాన్యాలు, బెల్లం, సుగంధ ద్రవ్యాలు, పిండి, పాల ఉత్పత్తులు, స్వీట్లు, స్నాక్స్, డ్రైఫ్రూట్స్, బేకరీ ఉత్పత్తులను సీజ్ చేశామన్నారు.

తనిఖీల్లో భాగంగా మొత్తం 13 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి 16 మంది ని అరెస్టు చేశామని, ఆరు వాహనాలను స్వా ధీనం చేసుకున్నామని అధికారులు వివరిం చారు. పండుగ సీజన్‌లో ఆహార ఉత్పత్తుల లైసెన్సులు ఉన్న విక్రేతల నుంచే ప్రజలు కొ నుగోళ్లు చేయాలని అధికారులు సూచించా రు. లేబుల్ లేని, విడి ఉత్పత్తులు, ధర ఎక్కు వ, ప్యాకేజింగ్‌లో లోపాలు, బ్యాచ్ నెంబర్లు, గడువు తేదీ ముగియడం వంటివి తనిఖీ చేయాలని అధికారులు కొనుగోలుదారుల కు విజ్ఞప్తి చేశారు.

కల్తీ పతంజలి ఆవు నెయ్యి స్వాధీనం?..

ఛత్రపతి సంభాజీనగర్‌లో రూ. 20 లక్షల విలువ చేసే 2,279 లీటర్ల పతంజలి ఆవు నెయ్యిని ఓ డిస్ట్రిబ్యూటర్ నుంచి స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ విక్రయాలపై తప్పుడు బ్రాండింగ్, కల్తీ జరిగి నట్లు అనుమానం ఉందని నాణ్యత పరీక్షల నిమిత్తం నెయ్యిని ల్యాబ్‌కు పంపించామని, తదుపరి దర్యాప్తు చేపట్టామన్నారు. 2006 నిబంధనల ప్రకారం ఈ నిల్వను మార్కెట్ లోకి సరఫరా కాకుండా సీజ్ చేసినట్లు తెలి పారు. కాగా అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 31 మధ్య కూడా ఎఫ్‌డీఏ చేపట్టిన తనిఖీల లో 17 సంస్థల నుంచి రూ. 79.4 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు