ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
కలెక్టర్ కు బీఆర్ఎస్ నేతల వినతిపత్రం
మహబూబాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికల(Congressional elections)కు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని, హామీలను అమలు చేసేలా, ఉద్యోగ నియామకాల భర్తీ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(Collector Sneha Sabarish)ను బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ మాజీమంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, బీరవల్లి భరత్ కుమార్ రెడ్డి తదితరులతో కలసి వినతిపత్రం అందజేశారు.