‘ప్రైవేటు’ ధన దాహం!?
- చికిత్స పేరిట అందినకాడికి దోపిడీ
- బలవుతున్న ప్రాణాలు
- పరిహారాలతో మమ అనిపిస్తున్న మేనేజ్మెంట్లు
మహబూబ్నగర్ క్రైం , నవంబర్ 11 : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు(Private hospitals) ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయనే ఆరోపణలు ఆందో ళన కలిగిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో(Emergency situations) ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు సరైన వైద్యం అందక, వైద్యుల నిర్లక్ష్యమో, నిర్వహ ణ లోపాలో తెలియని పరిస్థితుల్లో ప్రాణా లు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామో లేదోననే భయం ప్రజల్లో నెలకొంటోంది.
చికిత్స కంటే డబ్బులకే ప్రాధాన్యమా?
కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పేరుతో రోగుల కుటుంబాల నుంచి భారీగా డబ్బు లు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య సేవల్లో నిర్లక్ష్యం జరిగిందని బాధిత కుటుంబాలు ఆరోపించినా, వారి గోడును పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల నిర్వహ ణ, వైద్యుల అర్హతలు, అత్యవసర వైద్య సదుపాయాలు, చికిత్సా విధానాలపై నిరంతర పర్యవేక్షణ లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది.
ప్రాణం పోతే పరిహారంతో సరిపెడతారా?
రోగి ప్రాణాలు కోల్పోయిన తర్వాత బా ధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామనే హామీలు లేదా ఆర్థిక సహాయంతో వ్యవహారాన్ని ముగించే ప్రయత్నాలు జరుగుతున్నా యనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ కో ల్పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలరా? కుటుంబానికి జరిగిన నష్టాన్ని డబ్బుతో భర్తీ చేయగలరా? బాధ్యులపై చర్య లు తీసుకోకుండా పరిహారంతో సమస్యను ముగించ డం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అధికార యంత్రాంగం ఏం చేస్తోంది?
ప్రైవేట్ ఆస్పత్రులపై పర్యవేక్షణ బాధ్యత కలిగిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సరిపోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆస్పత్రుల్లో ని బంధనలు అమలవుతున్నాయా? అర్హత కలిగిన వైద్యులు అందుబాటులో ఉన్నారా? అత్యవసర చికిత్సా సదుపాయాలు ఉన్నా యా? అనే అంశాలపై కఠినమైన తనిఖీలు అవసరం.
ఇప్పటికైనా మేల్కొనాలి!
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య నిర్లక్ష్యంపై వచ్చే ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించాలి. తప్పిదం నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రుల గుర్తింపును రద్దు చేసే వరకు చర్యలు చేపట్టాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
ప్రజల ప్రాణాల కంటే ఆస్పత్రుల లాభాలే ముఖ్యమా? పరిహారం చెల్లిస్తే ప్రాణం తిరిగొస్తుందా? అధికార యంత్రాంగం మేల్కొని చర్యలు తీసుకునేది ఎప్పుడు? అనేది ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్న. ఇటీవల జడ్చర్ల లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వ్యక్తి మరణించిన ఆ విషయం బయటకు పోకుండా పరిహారంతో సరిచేసిందని తెలుస్తుంది. దీంతో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రిలో మరణాలు సంభవించిన ఇదే ప్రక్రియను కొనసాగిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ చేసేదేం లేక వెను తిరుగుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటుండ్రు.
ఇటీవల మహబూబ్ నగరంలో వివేక్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిలో నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన శరణప్ప చికిత్స పొందుతూ మరణించడంతో ఒక్కసారిగా జిల్లా కేంద్రంలో ప్రజల ప్రాముఖ్యత లేదా అనే చర్చ ఉప్పందుకుంది. ఇప్పటికైనా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయని విశ్లేషించాలని ప్రజలు కోరుతున్నారు.