అక్రమ పట్టాలకు భారీ స్కెచ్..
- నకిలీ డెత్పత్రాల రాకెట్ గుట్టు రట్టు..!-
- అధికార పెద్దల లీలలు
- అధికారుల్లో అలజడి
- పత్రాల వెనుక ముఠానే ఉందా..?-
- బలిపశువులు చిన్న ఉద్యోగులే..!
- తెరవెనుక సృష్టికర్తలు సేఫ్..
బెల్లంపల్లి, నవంబర్ 11 : అధికార పార్టీ లీడర్ల ఆక్రమిత భూముల పట్టాల(Titles of occupied lands) కోసం వేసిన భారీ స్కెచ్ అనూహ్యంగా బయట పడింది. అక్రమాస్తుల కోసం సృష్టించిన నకిలీ డెత్ సర్టిఫికెట్ల రాకెట్(Fake Death Certificate Racket) వెలుగు చూడటం జిల్లాలో కలకలం రేపుతుంది. ప్రభుత్వ శాఖల్లో(Government Department) తిష్ట వేసిన అవినీతి అక్రమాలకు ఈ సంఘటన అద్దం పడుతున్నది. డెత్ సర్టిఫికెట్ల రాకెట్ అధికార వర్గాలను ఒక్కసారి ఉలిక్కి పాటుకు గురిచేసింది.
ఈ రాకెట్ వెనుక కొందరు రాజకీయ పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ కార్యాయాల్లో పనిచేసే చిన్న ఉద్యోగులు ఇలాంటి అక్రమాలు సొంతగా చేసే సాహ సం చేయరనే అభిప్రాయాలున్నాయి. ఇలాం టి వాటి వెనుక బడా నేతలు, ఉన్నతాధికారుల ప్రమేయం తప్పనిసరి అన్న ఆరో పణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
అసలేం జరిగింది..
మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి మండలం(Bellampalli Mandal) పాత బెల్లంపల్లి, అకెనపల్లి శివారులో కొందరు అప్పన్నంగా భూములు కూడబెట్టుకున్నారు. ఆ భూముల అవసరం కోసమే ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్ల సృష్టి అని తెలుస్తోంది. కొందరు పెద్ద రైతులు అ క్కడి భూములను తమ ఆధీనంలో పెట్టుకున్నారు. ఆ భూములకు చెందిన యజమానులు ఎప్పుడో మృతి చెందారు. కనీసం వారి రక్త సంబంధీకులు కూడా స్థా నికంగా లేరు. ఈ పరిస్థితినీ ఆసరగా చేసుకునీ ఆ భూముల పట్టాలకు ప్లాన్ వేశారనీ తెలుస్తోంది.
పక్కాగ వారికోసమే ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్ల జారీ జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏకంగా డెత్ సర్టిఫికెట్ల కో సం ఓ ముఠాను సృష్టించారు. ఈ ముఠా లో ప్రధాన అధికారులతో పాటు కొందరు కిందిస్థాయి ఉద్యోగులకు ఆశలు కల్పించి ముగ్గులోకి దింపారనే సమాచారం. కొన్నేళ్ల నుంచీ నకిలీ డెత్ సర్టిఫికెట్లు జారీ ‘మూడు పూలు ఆరు కాయలు‘గా సాగుతున్నది. అధికార దన్నుతో ఈదందా చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నది.
బూధఖుర్దు నుంచే ఎందుకూ..?
భూధఖుర్దు పంచాయతీ కేంద్రంగా నకిలీ డెత్ సర్టిఫికెట్లు జారీ ఎందుకు చేశారు. అం దులో ఇక్కడి కార్యదర్శి సెలవుల్లో ఎందుకు వెళ్లాలి. ఇంచార్జీ కార్యదర్శిగా బోర్లకుంట శ్రీనివాస్ ఉన్నప్పుడే సర్టిఫికెట్ల బయటకు రావడమేంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన అవునూరి లింగయ్య 1989లో మృతి చెం దాడు. అతని పేరిట పంచాయతీ కార్యదర్శి ఎండి సాధుల్లా సంతకంతోనే లింగయ్యతో పాటు మరికొన్ని డెత్ సర్టిఫికెట్లు జారీఅయినట్టు తెలుస్తోంది.
లింగయ్యకు పాత బెల్లంపల్లి గ్రామ పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికెట్ జారీకి బదులు, బూధ ఖుర్దు నుంచి డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక్కడ అదే పేరుతో మరో లింగయ్య ఉన్నారు. ఇంటి పేరు, తండ్రుల పేరు మార్చి అక్రమంగా ఈ డెత్ సర్టిఫికెట్ ఆయన పేరుతో ఇచ్చారు. అందుకోసమే బూధకుర్దు పంచాయతీని ఈ ముఠా ఎంచుకున్నది. లింగయ్య పేరిట నకిలీ డెత్ సర్టిఫికెట్ సెప్టెంబర్ 29న జారీ అయ్యింది.
ఈ పక్రియ తరువాతే ఇక్కడి పంచాయతీ కార్యదర్శి సాదుల్లా సెలవులో ఉండి, కన్నాల గ్రామం పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ ఇంచార్జీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలోనే ఈ వ్యవహారం వెలుగులోకి రావడం పెద్ద ట్విస్ట్ గా కనిపిస్తున్నది. ఇదే సమయంలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల తయారీలో కీలక పాత్ర వహించిన ఎంపీడీవో ఆఫీసులోని ఆపరేటర్ శ్రీనివాస్ ఆకస్మికంగా ఉడాయించడం మరో సంచలన చర్చనీయాంశం అయ్యింది.
బూధకుర్దు కేంద్రంగా వెలుగు చూసిన నకిలీ డెత్ సర్టిఫికెట్ల జారీపై తాళ్ళ గురజాల పోస్టేషన్లో ఇంచార్చి కార్యదర్శి శ్రీనివాస్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ పర్యవేక్షణలోఉన్న బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ లో నకిలీ డెత్ సర్టిఫికెట్ల దందా సాగడంపై ప్రజలు పలు విధాలుగా చర్చించుకున్నారు. అధికారుల్లో లోపించిన జవాబుదారీకి ఈ సంఘటన మచ్చుతునక అయ్యింది. కాగా ఈ అక్రమ నకిలీ డెత్ సర్టిఫికెట్ల జారీ సంఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
బెల్లంపల్లిలో వెలుగు చూసిన నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంతో బూధ ఖుర్దు గ్రామ పంచాయతీ రచ్చ కెక్కింది. అదికాస్తా ఇక్కడి అధికారి పార్టీ నేతలకు ఈ అక్రమ దందా చుట్టుకుంటున్నది. వారి పాత్ర లేకుండా పాత బెల్లంపల్లి, అకెనపల్లి శివారు భూముల కోసం బూదఖుర్దులో నకిలీ డెత్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తారనేదే ఇక్కడ ప్రధానాంశంగా కనిపిస్తోంది. అధికార పార్టీ ముఖ్యులు కూడబలుక్కుని చేసిన పనిగా స్థానికులు చర్చించుకుంటున్నారు. -
మండల కాంగ్రెస్లో దుమారం..
ఈ సంఘటన మండల కాంగ్రెస్ లోపెద్ద దుమారమే లేపుతున్నది. ఎక్కడ చూసినా నకిలీ డెత్ సర్టిఫికెట్ల రాకెట్ పైనే చర్చ జరుగుతోంది. జిల్లాలో ఇపుడు ఇదే అంశంపై వాడివేడి చర్చ జరుగుతోంది. దీనిపై అధికారులు ఏమి చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. తప్పుడు పద్ధతుల్లో ఇచ్చిన నకిలీ పత్రాలపై అధికారులు విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి అక్రమాలకు కారణమైన ఎంతటి పలుకుబడి ఉన్న వారినైనా వదిలిపెట్టకుండా నిజాయితీగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి అక్రమాలకు కళ్లెం వేయాల్సిన అవసరం అధికారులపై ఎంతైనా ఉంది. లక్షల వేతనాలు పొందుతూ ఇలాంటి అక్రమాలకు ప్రత్యక్ష, పరోక్షంగా సహకరించినా అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.