అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
14-11-2026 | 08:25pm
పాపన్నపేట,నవంబర్14: మండల పరిధిలోని ముద్దపూర్ గ్రామ మాజీ సర్పంచ్ అంతటి దానయ్య(Antati Danayya, former Sarpanch of Muddapur village) శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో(Illness) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో(Illness) బాధపడుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. దానయ్య మృతితో గ్రామస్తులు, మండల ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు(BRS party workers) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 2019 సంవత్సరం నుంచి 2024 వరకు సర్పంచ్ గా పనిచేసి ప్రజల మన్ననలను పొందారు. గతంలో ఉపసర్పంచ్ గా సైతం పనిచేశారు. ఆయన మృతి పట్ల గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలిపారు.