పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రజా ప్రభుత్వం

19-11-2026 | 11:20pm

కొంతాన్‌పల్లిలో నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత

గ్రామ సర్పంచ్ చింతల విజయ వెంకట్రాంరెడ్డి

శివంపేట్ నవంబర్ 19(విజయక్రాంతి): శివంపేట అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు(Welfare schemes) అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని శివంపేట మండల పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి అన్నారు. మండలంలోని కొంతాన్‌పల్లి(Konthanpally) గ్రామంలో నూతనంగా మంజూరైన పింఛన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ఘనంగా పంపిణీ చేశారు. పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ చింతల విజయ వెంకట్రాంరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా చింతల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నూతన పింఛన్ల మంజూరు(New Pension Sanction)తో వృద్ధులు, వికలాంగులు, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. పింఛన్లు వారి దైనందిన అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

పేదలు, వృద్ధులు, వికలాంగులకు అండగా నిలుస్తూ నూతన పింఛన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామికి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డికి కొంతాన్‌పల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధిక, గ్రామ ఉపసర్పంచ్ బొల్లారం కుమార్, వార్డు సభ్యులు ఉప్పరి సంతోష్ కుమార్, గుండు వేణు, చింతల లక్ష్మారెడ్డి, లక్ష్మణ్ చారి, శ్రీశైలం, మురళి, రవి, నూతన పింఛన్ లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు