ఎల్లమ్మ భక్తుల నిలువు దోపిడి

12-11-2026 | 05:20am
  1. ఎల్లమ్మ సాక్షిగా ప్రతి వస్తువుపై అధనం
  2. దర్శనానికి వస్తే జేబులు ఖాళీ అవుతున్నాయంటున్న భక్తులు
  3. అదుపు చేసే నాధుడే లేడా?

చేగుంట, నవంబర్ 11 : కష్టాలు తీర్చితే, నిలువు దోపిడి  ఇస్తామని మొక్కులు మొక్కుకుంటున్న చేగుంట మండలంలోని(Chegunta Mandal) చిన్న శివనూర్ గ్రామ శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ(Sri Renuka Yellamma) తల్లీ  క్షేత్రానికి వచ్చే భక్తులు, అమ్మ దర్శనానికి వస్తే మిమ్మల్ని మేమే దోచుకుంటామని  కుల సంఘము సభ్యులు,  అమ్మకు మొక్కులు  సమర్పించే కానుకలు, ముడుపులు ఎలా ఉన్నా అధిక ధరల పేరిట సాగుతున్న దగానే ఎక్కువగా ఉంటుంది. 

ఎల్లమ్మ  తల్లి ఆలయంలో నిరుపేద  కుటుంబ సభ్యులతో కలిసి , వనభోజనానికి వచ్చి  చేట్టు కింద వంట వార్పు చేసుకున్న, డబ్బులు చెల్లించాల్సిందే, పుణ్యక్షేత్రంలో భక్తుల దోపిడీ యదేచ్ఛగా సాగుతున్నా అదుపు చేసే నాధుడే లేడు. దీంతో మాతను దర్శించుకుందామని వచ్చే లక్షలాది మంది భక్తులు(devotees) తీవ్రంగా నష్టపోతున్నారు.

భక్తుడే సర్వస్వం..

 దేవుడు ఉన్నది భక్తుడి కోసమే.. భక్తుడు సైతం దేవస్థానానికి వచ్చేది దేవుడి కోసమే. భక్తుడికి దేవుడికి మధ్య అనుబంధాన్ని పెంచేలా సౌకర్యాలు కల్పించాల్సిన దేవస్థానం అందుకు విరుద్ధంగా ఆదాయమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు.  

దోచుకుంటున్నారు..

మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవాలయంలో  ఎల్లమ్మ దేవాలయం ఒకటి అమ్మను వీలున్నప్పుడల్లా కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకుంటాం. ఆలయం లోకి ప్రవేశించిన వెంటనే దోపిడీ ప్రారంభమవుతోంది.  నిర్వాహకులు కట్నాల పేరిట డిమాండ్ చేస్తూ భక్తుడు నుంచి వసూలు చేస్తున్నారు.

ఆయా మొక్కులకు సంబంధించిన రసీదులను దేవాలయం నుంచి తీసు కున్నా సరే.. కట్నం ఇవ్వాల్సిందేనని నిర్వాహకులు డిమాండ్ చేస్తూ వసూలు చేస్తున్నారు. ఆలయం చెంతన ఉన్న ఓ దుకాణంలో కొ బ్బరికాయ  తీసుకుంటే రూ.20కు బదులు గా రూ.50 తీసుకుంటున్నారు. కొత్త బండి పూజలు నిర్వహిస్తే 500 రూపాయలు చెల్లి ంచాల్సిందే,ఇలా ప్రతి వస్తువుపై దాని విలువను బట్టి  దండుకుంటున్నారు. చేసేదేమీ లేక వారు అడిగినంత ఇచ్చి పూజలు నిర్వహించుకోవాల్సిన  పరిస్థితి ఉంది.

 చిక్కుడు మహేష్ , భక్తుడు, చేగుంట

మరిన్ని వార్తలు