చంద్రయాన్ లాఫింగ్ థెరపీ

12-11-2026 | 05:10am

నిర్మాత వేణు ఊడుగుల(Producer Venu Udugula) తన సమర్పణలో ‘చంద్రయాన్(Chandrayaan)’ సినిమాను తీసుకొస్తున్నారు. శివ కుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవిశివతేజ, వంశీధర్, లోకేశ్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకుడు. ఈ నెల 13న రిలీజ్‌కు కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) అతిథిగా విచ్చేశారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ఈ టీమ్ చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా” అన్నారు. వేణు ఊడుగుల మాట్లాడుతూ.. “ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తూ, వినోదాన్ని అందించే చిత్రమిది” అన్నారు.

హీరో శివకుమార్ మాట్లాడుతూ.. “హీరో కావడం నా పదేళ్ల కల. ఈ జర్నీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. చంద్రయాన్ వంటి మంచి అవకాశం రావడం హ్యాపీగా ఉంది” అన్నారు. డైరెక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ.. “ఈ నెల 13వ తేదీ నుంచి ప్రతి థియేటర్‌లో నవ్వులు హంగామా మొదలవుతుంది” అని చెప్పారు. ‘కొత్త తరహా ఎంటర్‌టై నర్ చంద్రయాన్’ అని నిర్మాత ప్రవీణ్ మొలక  అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు, మూవీ టీమ్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా మాట్లాడారు. 

మరిన్ని వార్తలు