మంచి చిత్రాలకు ప్రోత్సాహం సామాజిక బాధ్యత

12-11-2026 | 05:05am

దివ్య ప్రవీణ్ బొలిశెట్టి(Divya Praveen Bolisetti) నిర్మాణంలో నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’(Jayanth and the Jingo Pen). ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి, సత్యం రాజేశ్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్‌రెడ్డి, అశోక్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, సాయికృష్ణ ముఖ్య పాత్రలను పోషించారు.

నవంబర్ 14న విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి, మాట్లాడుతూ.. “ఇలాంటి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి” అన్నారు. దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. “ఇలాంటి మంచి సినిమాల్ని ప్రోత్సహించడం మన అందరి సామాజిక బాధ్యత” అన్నారు. నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. “జయంత్ అండ్ ది జింగో పెన్’ ఎమోషనల్ స్టోరీ” అని చెప్పారు. మిగతా చిత్రబృందం కూడా మాట్లాడారు. 

మరిన్ని వార్తలు