రంగు రంగు పిల్లరో..
రాజ్ తరుణ్(Raj Tarun) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘టార్టాయిస్(Tortoise)‘. ఇందులో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు రిత్విక్ కుమార్ సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిస్తున్నారు.
ఈ సినిమా నుంచి తాజాగా ‘రంగు రంగు పిల్లరో..’(Releases Rangu Rangu Pillaro) లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా, ప్రముఖ జానపద గాయకుడు, కవి పెంచల్ దాస్ లిరిక్స్ రాసి పాడారు. ఈ చిత్రానికి డీవోపీ: శబరి విక్నేష్; సంగీతం: అనూప్ రూబెన్స్; యాక్షన్: బెమనొల శ్రీకాంత్; ఎడిటర్: గుళ్లపల్లి మాధవ్ కుమార్; ఆర్ట్: దేవర మధుకర్.