ఆస్కార్ బరిలోకి రామాయణ!

12-11-2026 | 05:25am

భారతీయ సినీ ప్రేక్షకులు(Indian cinema audiences) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’ మరో కీలక ఘట్టంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రం ఆస్కార్ బరిలోకి నిలువనున్నట్లు సమాచారం. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటించిన ఈ ప్రతి ష్ఠాత్మక చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

99వ అకాడమీ అవార్డుల కోసం చిత్ర నిర్మాతలు ‘రామాయణ: పార్ట్ 1’ను పరిశీలనకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, 99వ ఆస్కార్ అవార్డుల కోసం భారత్ తరఫున అధికారికంగా మరాఠీ చిత్రం ‘గోంధల్’ ఎంపికైంది. కాబట్టి అకాడమీ నిబంధ నల ప్రకారం థియేట్రికల్ ప్రదర్శన, ఇతర అర్హతలను పూర్తి చేసిన తర్వాతే ‘రామా యణ’ తదుపరి దశలకు వెళ్లే అవకాశం ఉంటుంది.  దీంతో ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ దిశగా ఎంతవరకు ముందుకె ళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని వార్తలు