సూపర్ హీరోగా రోషన్

12-11-2026 | 05:15am

రోషన్ మేక(Roshan Meka) హీరోగా డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి(Mohanakrishna Indraganti) ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అశోక క్రియేషన్స్ పతాకంపై ఓ భారీ ప్రాజెక్టు పాన్ ఇండియా(Pan India) స్థాయిలో రూపొందనుంది. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం ప్రారంభం కాగా, హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. చిత్ర సమర్పకుడు ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేసి, చిత్రబృందానికి స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు మోహనకృష్ణ రోషన్ మేకను గతంలో ఎన్నడూ చూడని పవర్‌ఫుల్ సూపర్ హీరో అవతార్‌లో చూపించేందుకు భారీ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ కథను సిద్ధం చేశారు.

ఈ సినిమాతో బాలీవుడ్ నటి రేఖా పాండే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నటుడు వినయ్ రాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి డీవోపీ: పీజీ విందా; సంగీతం: గౌర హరి; యాక్షన్: లీ విటేకర్, రామకృష్ణ; ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేశ్; ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోట్రే.  

మరిన్ని వార్తలు