సిద్ధు ప్రేమకథ ప్రారంభం
ఇందులో నయన్ సారిక హీరోయిన్గా(Nayan Sarika is the heroine.) నటించనుంది. ఈ సినిమా బుధవారం సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సుకుమార్(Sukumar) కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అల్లు అరవింద్ తొలి క్లాప్ కొట్టారు. నిర్మాతలు విశ్వప్రసాద్, బాపినీడు, దర్శకులు బుచ్చిబాబు, చందూ మొండేటి చిత్రబృందానికి స్క్రిప్ట్ అందించారు. దర్శకులు హరీశ్ శంకర్, నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
సినిమా ప్రారంభోత్సవం సంద ర్భంగా మేకర్స్ విడుదల చేసిన థీమ్ పోస్టర్(Theme Poster).. కథలోని భావోద్వేగ ప్రపంచాన్ని, అందమైన ప్రేమకథను పరిచయం చేసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రఫీని, సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త చిత్రం ‘సిద్ధు10’లో సరికొత్త ప్రేమకథతో అలరించబోతున్నారు. తబిత సుకుమార్ సమర్పణలో, సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బండ్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో మోహన్ బీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుకుమార్ టీమ్‌లో కీలకంగా ఉన్న మోహన్ బీ.. ఈ సినిమా కోసం ఒక అందమైన, కొత్త తరహా ప్రేమకథను సిద్ధం చేశారు.
ఇందులో నయన్ సారిక హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమా బుధవారం సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అల్లు అరవింద్ తొలి క్లాప్ కొట్టారు. నిర్మాతలు విశ్వప్రసాద్, బాపినీడు, దర్శకులు బుచ్చిబాబు, చందూ మొండేటి చిత్రబృందానికి స్క్రిప్ట్ అందించారు.
దర్శకులు హరీశ్ శంకర్, నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా ప్రారంభోత్సవం సంద ర్భంగా మేకర్స్ విడుదల చేసిన థీమ్ పోస్టర్.. కథలోని భావోద్వేగ ప్రపంచాన్ని, అందమైన ప్రేమకథను పరిచయం చేసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రఫీని, సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.