వెంకీ అట్లూరి బంగారు బాతు!
రుష్య దత్తా(Rushya Datta) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డాన్ బాస్కో’. రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి నిర్మాణంలో గౌరీశంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మిర్నా మీనన్, మౌనిక, మురళీశర్మ, ప్రిన్సిపాల్ విశ్వనాథ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, విష్ణు ఓఐ, ఉత్తేజ్, వినయ్ నల్లకడి, మోహన శ్రీ సురాగా కీలక పాత్రలు పోషించారు. బుధవారం జరిగిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “నేను సొంతంగా సినిమా నిర్మిస్తే ఎంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటానో ఈ చిత్రం కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు. హీరో రుష్య దత్తా మాట్లాడుతూ.. “వెంకీ అట్లూరి బంగారు బాతులాంటి వారు. ఆయన చేతుల మీదుగా లాంచ్ అవుతుండటం ఆనందంగా ఉంది” అని చెప్పారు. హీరోయిన్ మిర్నా మాట్లాడుతూ.. “ఇంత వరకు నేను ఇంటెన్స్ పాత్రల్ని పోషించాను. ఇలాంటి రోమ్ కామ్ పాత్రను చేయడం ఆనందంగా ఉంది” అని చెప్పింది.
‘మా సినిమా గురించి మేం మాట్లాడే కంటే మా కంటెంట్ మాట్లాడితే బాగుంటుంద’ని డైరెక్టర్ గౌరీశంకర్ అన్నారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. “డాన్ బాస్కో’ టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాం. త్వరలోనే మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాం” అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. “డాన్ బాస్కో’ చిత్రంలో ఫ్రెండ్ షిప్ గురించి అందంగా చూపించారు. ఇందులో మంచి ఎమోషన్ ఉంటుంది” అని తెలిపారు.