కురుమూర్తి జాతరకు ఆర్టీసీ బస్సులు.!
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కురుమూర్తి జాతర(Kurumurthy Jathara) సందర్భంగా ఆదివారం నుంచి నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య(RTC Depot Manager Yadaiah) తెలిపారు. శనివారం డిపోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ నెల 16న జరిగే ఉద్దాల ఉత్సవానికి 20 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బస్సు టికెట్ ధర రూ.200గా నిర్ణయించగా, మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. భక్తుల రద్దీని బట్టి అదనపు బస్సులు నడుపుతామన్నారు. అలాగే అరుణాచలం, భద్రాచలం, కాశీ, అయోధ్య తదితర పుణ్యక్షేత్రాలకు సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.